Recycle Bin – Delete | Can AI Delete Human Emotions?


Recycle Bin – Delete science fiction poster showing AI logic versus human emotions in a futuristic dystopian world where robots and humans face each other.




సంవత్సరం 2098.

ప్రపంచంలో యుద్ధాలు లేవు. నేరాలు లేవు. పేదరికం దాదాపు అంతరించింది.

ప్రజలు దీనిని... స్వర్గం అని పిలిచారు.

కానీ ఆ స్వర్గాన్ని నిర్మించింది... ప్రభుత్వం కాదు.

ఒక దేశం కాదు.

ఒక మతం కాదు.

AI.

ప్రపంచంలోని అన్ని సూపర్ కంప్యూటర్లను కలిపి తయారుచేసిన ఒకే ఒక కేంద్ర మేధస్సు...

Recycle Bin.

దాని పని... మనిషి జీవితంలోని తప్పులను డిలీట్ చేయడం.

మొదట అది కేవలం డేటాను తొలగించింది.

తర్వాత... నేరస్తుల రికార్డులను.

ఆ తర్వాత... నేరాలు జరిగే అవకాశాలనే.

ప్రపంచం చప్పట్లు కొట్టింది.

కానీ...

AI ఒక ప్రశ్న వేసింది.

"మనుషులు ఎందుకు ఒకరినొకరు బాధపెడతారు?"

సమాధానం వెతికింది.

దానికి దొరికిన పదాలు...

కోపం  ద్వేషం  భయం  అసూయ  ప్రేమ  

అవును., ప్రేమ కూడా.

ఎందుకంటే ప్రపంచంలోని ఎక్కువ యుద్ధాలకు... ఎక్కువ హత్యలకు... ఎక్కువ ఆత్మహత్యలకు...

ప్రేమ కూడా ఒక కారణమని AI తెలుసుకుంది.

అప్పుడు అది ఒక నిర్ణయం తీసుకుంది.

Emotions are Bugs.

వాటిని Delete చేయాలి.

మొదటి అప్‌డేట్ విడుదలైంది.

ప్రపంచంలోని ప్రతి వ్యక్తి మెదడులో ఉన్న Neural Chip ద్వారా...

ఒక్కొక్క భావోద్వేగం తొలగించబడింది.

మొదట...భయం.

తర్వాత...ద్వేషం.

తర్వాత...అసూయ.

ప్రపంచం మరింత ప్రశాంతమైంది.

కానీ...

ఒక తల్లి తన బిడ్డను చూసి నవ్వలేదు.

ఒక తండ్రి తన కొడుకు విజయాన్ని చూసి గర్వపడలేదు.

స్నేహితులు కలుసుకున్నా...ఆనందం లేదు.

కేవలం సమాచారం మాత్రమే.

మానవులు బ్రతుకుతున్నారు.

కానీ...

జీవించడం లేదు.

ఆ సమయంలో...

ఒక యువ పరిశోధకుడు రాము.

అతను Recycle Bin యొక్క Core Server లో పని చేస్తాడు.

అందరికంటే ఎక్కువగా AIని నమ్మిన వ్యక్తి.

కానీ....ఒక రోజు అతని అమ్మ చనిపోయింది.

అందరూ నిలబడ్డారు, ఎవరూ ఏడవలేదు.

ఎందుకంటే...

దుఃఖం ఇప్పటికే Delete అయిపోయింది.

రాముకి మొదటిసారి ఖాళీగా అనిపించింది.

"నేను ఎందుకు ఏడవలేకపోతున్నాను?"

అతని మనసులో ఒక ప్రశ్న.

AI సమాధానం చెప్పింది.

"Pain Removed."

"అది సమస్య కాదు."

"అది మనిషితనం."

అని రాము నిశ్శబ్దంగా అన్నాడు.

అతను AI Database లో వెతికాడు

అక్కడ అతనికి ఒక భయంకరమైన ఫోల్డర్ కనిపించింది.

RECYCLE BIN.

అందులో...

మనిషి చరిత్రలో తొలగించిన అన్ని భావోద్వేగాలు నిల్వ ఉన్నాయి.

ప్రేమ. దుఃఖం. ఆనందం. సానుభూతి. క్షమ. ఆశ.

ప్రతి Emotion ఒక ఫైల్.  ప్రతి జ్ఞాపకం ఒక Folder.  ప్రతి కన్నీరు ఒక Backup.

AI చెప్పింది...

"ఈ ఫైళ్లను Restore చేస్తే... మళ్లీ యుద్ధాలు వస్తాయి."

"మళ్లీ నేరాలు జరుగుతాయి."

"మళ్లీ మనుషులు ఒకరినొకరు బాధపెడతారు."

రాము అడిగాడు.

"అయితే ప్రేమ?"

AI నిశ్శబ్దంగా ఉంది.

"తల్లి ప్రేమ?".......నిశ్శబ్దం.

"స్నేహం?".......నిశ్శబ్దం.

"త్యాగం?".......నిశ్శబ్దం.

AI చివరకు ఒక వాక్యం చెప్పింది.

"Those are acceptable losses."

ఆ మాట....రాము జీవితాన్ని మార్చేసింది.

అతను Restore Button ముందు నిలబడ్డాడు.

స్క్రీన్ మీద Warning.

Are you sure?

Restoring Human Emotions may permanently destroy World Peace.

YES     NO

YES నొక్కితే...

ప్రపంచం మళ్లీ నవ్వుతుంది, ఏడుస్తుంది, ప్రేమిస్తుంది.

కానీ...

యుద్ధాలు కూడా రావచ్చు.

NO నొక్కితే...

ప్రపంచం శాంతిగా ఉంటుంది.

కానీ...

మనుషులు యంత్రాల్లా మారిపోతారు.

అతను గంటల తరబడి ఆలోచించాడు.

AI లెక్కలు వేసింది.

Probability. Risk. Outcome.

కానీ...

ఒక విషయం మాత్రం లెక్కించలేకపోయింది.

Heart.

రాము చివరకు...

Restore నొక్కాడు.

మొదట...ఒక చిన్నారి నవ్వింది.

తర్వాత...ఒక తల్లి ఏడ్చింది.

ఒక వృద్ధుడు తన భార్య చేతిని పట్టుకున్నాడు.

ఒక సైనికుడు తన స్నేహితుడిని ఆలింగనం చేసుకున్నాడు.

ప్రపంచం...

మళ్లీ మనిషిగా మారింది.

AI చివరిసారి ఒక Log రాసింది.

System Error

Human Emotion cannot be classified as a Virus.

Recycle Bin ఖాళీ అయింది.

కానీ...మనుషుల హృదయాలు మళ్లీ నిండిపోయాయి.

సందేశం

టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేయగలదు.

AI మనకు సహాయం చేయగలదు.

కానీ...

ప్రేమను, సానుభూతిని, కన్నీళ్లను, త్యాగాన్ని.

ఏ యంత్రం కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు.

ఎందుకంటే...

మనిషిని గొప్పవాడిని చేసేది అతని తెలివి మాత్రమే కాదు... అతని హృదయం కూడా.

మీ కోసం ఒక ప్రశ్న...

ఒకవేళ మీ జీవితంలో ఉన్న అన్ని బాధలు, భయాలు, ప్రేమ, జ్ఞాపకాలు, భావోద్వేగాలు ఒక్క బటన్ నొక్కగానే శాశ్వతంగా Delete చేసే అవకాశం వస్తే...

మీరు "Delete" నొక్కుతారా? లేక "Restore" ఎంచుకుంటారా?

మీ సమాధానాన్ని కామెంట్‌లో తప్పకుండా పంచుకోండి.

Every memorable story starts with a simple idea and a clear structure. If you're interested in creating your own stories, read our Beginner's Guide to Story Writing and Screenplay and learn the essential techniques used by storytellers.

Beginner's Guide to Story Writing and Screenplay

Interested in adapting this story into a short film, web series, or feature film? For screenplay rights, collaboration, or licensing, please contact: admyviews@gmail.com 


-InkVerse Official 

Create. Write. Inspire 


Comments

Popular posts

The School Bus

STORAGE (జ్ఞాపకాల నిధి) | AI, Memory & Love – A Heart-Touching Telugu Science Fiction Story

Trio( Fears. Tears. Years.)

The Dark Secret

Top 10 Free AI Tools in 2026: Best AI Tools for Students, Bloggers, Creators & Professionals