ARRIVAL | Telugu Suspense Story | By AD
ARRIVAL | Telugu Suspense Story | By AD Note : You can read this story in the language you prefer. Use the Translator option on InkVerse Official to translate and enjoy the story in your preferred language. రాము తిరిగి వచ్చిన రోజు… Airportలో అసలు ఏం జరిగింది? కొంతమంది మనుషులను చూసి… “వీడితో ఏం ఉపయోగం?” అని అనుకుంటాం. కానీ అదే మనిషి ఒకరోజు మన ముందే నిలబడి… మనం ఊహించని సమాధానం ఇస్తే?, రాము అలాంటి వ్యక్తే. అతను చేసే ప్రతి పనికి వెంటనే ఫలితం రావాలని కోరుకునే వ్యక్తి కాదు, తాను చేస్తున్న పని ఒకరోజు అందరికీ తెలియాలని మాత్రం కోరుకునేవాడు. రాము ఎప్పుడూ ఒక ప్రశ్నార్థకంగానే ఉండేవాడు. రాము చదువు పూర్తిచేసి అప్పటికే ఏడు సంవత్సరాలకు పైగానే అయింది, ఉద్యోగం లేదు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడా?, అని అడిగితే “...........” అంతే అంతకంటే ఎక్కువ సమాధానం వచ్చేది కాదు. ఇంట్లో వాళ్లకు మాత్రం అది నచ్చేది కాదు. “నీతో చదివిన వాళ్లంతా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు.” “నువ్వేం చేస్తున్నావు?” “ఇలా ఎప్పటివరకు ఉంటావు?” “కనీసం ఏదైనా చిన్న ఉద్యోగం అయినా చూసుకో!” రోజూ ఇలాంటి మాటలు రాముకు వినిపించేవి....