Project – D | Telugu Suspense Thriller Story | Mystery & Technology

Project D Telugu suspense thriller story cinematic poster featuring dreams, mystery, surveillance and a secret storage device




PROJECT – D

Note:  Readers can use the Translator option in the blog to read this article in their preferred language.


రాము జీవితంలో అతనికి ఎప్పుడూ ఒక ప్రశ్న ఉండేది. “నాకు నిజంగా ఎవరైనా ఉన్నారా?” ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేవారు ఎవరూ లేరు. ఎందుకంటే… రాము పుట్టిన రెండేళ్లకే అతని తల్లి చనిపోయింది, తండ్రి అతన్ని ఒక అనాథాశ్రమంలో వదిలేసి వెళ్లిపోయాడు.


ఎందుకు వెళ్లిపోయాడో తెలియదు.

ఎక్కడికి వెళ్లాడో తెలియదు.

అసలు అతను ఇంకా బ్రతికే ఉన్నాడో కూడా తెలియదు.

అతనికి తెలిసిన ప్రపంచం ఆ అనాథాశ్రమమే. అక్కడి గోడలు, అక్కడి పిల్లలు, అక్కడి వార్డెన్.అక్కడే చదువు, బాల్యం, కన్నీళ్లు, నవ్వులు. ఎవరూ లేని జీవితంలో కలలు మాత్రం ఉండేవి

రాము చిన్నప్పటి నుంచే చాలా బాగా చదివేవాడు. అతనికి ఒకే ఒక నమ్మకం. “నాకు కుటుంబం లేకపోవచ్చు… కానీ నాకు భవిష్యత్తు ఉంది.” ఆ మాటను నిజం చేయడానికి అతను కష్టపడి చదివి స్కాలర్‌షిప్‌లు సంపాదించాడు, మంచి ఉద్యోగం సంపాదించాడు. ఒక చిన్న ఇల్లు తీసుకున్నాడు. సాధారణ జీవితం. ఉదయం  ఆఫీస్, సాయంత్రం ఇంటికి రావడం, వీకెండ్‌లో కొంచెం విశ్రాంతి. అలా అతని జీవితం చాలా సింపుల్‌గా సాగిపోయేది.

ఎంత బిజీగా ఉన్నా రాము మనసులో ఒక ఖాళీ ఎప్పుడూ ఉండేది. రోడ్డుపై ఒక తండ్రి తన చిన్న కొడుకు చేయి పట్టుకుని నడుస్తుంటే రాము కాసేపు వాళ్లని చూస్తూ ఉండేవాడు. ఒక తల్లి తన పిల్లాడికి తినిపిస్తుంటే అతని కళ్లలో తెలియకుండానే ఏదో బాధ కనిపించేది.

రాముకి దేవుడిపై నమ్మకం ఎక్కువ, దేవుడిని చాలా నమ్మేవాడు. ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్లేవాడు. ఏ పని ప్రారంభించినా దేవుడిని గుర్తు చేసుకునేవాడు. అతని జీవితంలో ఎవరూ లేకపోయినా “దేవుడు ఉన్నాడు” అనే నమ్మకం మాత్రం అతన్ని ఒంటరిగా అనిపించనివ్వకుండా చేసేది.

రాముకి ఇంకొక అలవాటు ఉండేది. అది కలలు. రాముకి చాలా ఎక్కువగా కలలు వచ్చేవి. మంచి కల వస్తే నిద్రలోనే నవ్వుకునేవాడు. ఎప్పుడైనా భయంకరమైన కల వస్తే, ఉదయం లేవగానే గుండె వేగంగా కొట్టుకునేది. నేరుగా దేవాలయానికి వెళ్లిపోయేవాడు. “దేవుడా… ఇది కేవలం కలే కదా?” అని మనసులో అడిగేవాడు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. అంతా సాధారణంగానే జీవితం ముందుకు సాగిపోయేది.

అయితే…

ఒక రోజు సాయంత్రం రాము దేవాలయం నుంచి బయటకు వస్తున్నాడు. దేవాలయం దగ్గర కొంతమంది ఒక క్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడ Blood Donation, Organ Donation Registration, Free Full Body Check-up బ్యానర్ చూసాడు.

“నాకు ఎవరూ లేరు…కానీ నేను ఎవరికైనా ఉపయోగపడవచ్చు.” అనుకొని రక్తదానం చేశాడు, పూర్తి శరీర పరీక్ష కూడా చేయించుకున్నాడు. ఆ తర్వాత  Organ Donation గురించి వివరాలు అడిగి ఫారమ్ తీసుకున్నాడు.

సంతకం చేయడానికి ముందు,  “ఈ జన్మలో నాకు కుటుంబం లేకపోయినా… నేను చేసిన ఈ మంచి పని వల్ల వచ్చే జన్మలో అయినా నాకు ఒక కుటుంబం దొరుకుతుందేమో…” అని అనుకొని ఫారమ్‌పై సంతకం చేశాడు.

ఆ రోజు నుంచి కొన్ని రోజులు గడిచాయి. రాము తన సాధారణ జీవితంలోకి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి ఒక విచిత్రమైన ఫీలింగ్ రావడం ప్రారంభమైంది. ఎవరో తనను గమనిస్తున్నట్లు. ఆఫీస్‌కు వెళ్తున్నప్పుడు ఎవరో వెనక ఉన్నట్లు. సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు ఎవరో దూరం నుంచి చూస్తున్నట్లు అనిపించేది “నా భ్రమ అయి ఉంటుంది.” అనుకొని.తన పనిలో మళ్లీ బిజీ అయిపోయాడు. కానీ కొన్ని విషయాలు మనం ఊహించినట్టు ఉండవు. కొన్ని సందర్భాల్లో మనల్ని ఎవరూ గమనించడం లేదని అనుకుంటున్నప్పుడు కూడా ఎవరో మన గురించి అన్నీ తెలుసుకుంటూ ఉంటారు.

ఒక రోజు ఉదయం సుమారు ఆరు గంటలు. రాము ఇంకా నిద్రలోనే ఉన్నాడు. అప్పుడే టక్… టక్… టక్… అతని ఇంటి తలుపు కొట్టిన శబ్దం వచ్చింది. రాము ఒక్కసారిగా లేచాడు. “ఇంత ఉదయాన్నే ఎవరు?” అనుకుంటూ తలుపు దగ్గరకు వెళ్లాడు. బయట ఎవరూ లేరు. కారిడార్ మొత్తం ఖాళీగా ఉంది. అతని కాళ్ల దగ్గర ఒక చిన్న పార్సెల్ కనిపించింది. ఎలాంటి పేరు, అడ్రస్ లేదు. ఎవరు పంపారో తెలియదు. కొద్దిసేపు దాన్ని చూస్తూ నెమ్మదిగా తెరిచాడు.

 అందులో ఒక చిన్న Storage Device ఉంది. దాని మీద PROJECT – D అని ఉంది. దానితోపాటు ఒక చిన్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసిన వెంటనే “ఈ వ్యక్తిని నేను ఎక్కడో చూశాను…” “ఎక్కడ?” ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు అని అనుకుంటూ డివైస్‌ను తన సిస్టమ్‌కు కనెక్ట్ చేస్తాడు. అందులో DREAM_001  ఒకే ఒక ఫోల్డర్ కనిపించింది, ఫోల్డర్ ఓపెన్ చేశాడు. అందులో ఒక వీడియో ఫైల్ ఉంది  ప్లే చేశాడు. మొదట స్క్రీన్ నల్లగా ఉంది. తర్వాత వీడియో ప్రారంభమైంది. రాము కళ్లలో భయం  ఎందుకంటే ఆ వీడియోలో కనిపిస్తున్నది రాముకి ఆ రాత్రి వచ్చిన కల. “ఇది ఎలా సాధ్యం?” వీడియోను మళ్లీ ప్లే చేశాడు. అదే కల.  రాత్రి నిద్రలో చూసిన కల. షాక్‌లో రాముకి మాటలు రాలేదు. అతని మనసులో ఎన్నో ప్రశ్నలు...

“నా కల రికార్డ్ చేశారా?, కానీ అది అసాధ్యం.

ఆ వీడియో ఎవరు తీశారు?

PROJECT – D అంటే… Project Dream?

ఈ Project ఎవరిది?

ఎందుకు తనకు సంబంధించిన కలలు ఇందులో ఉన్నాయి?

ఎందుకు ఆ Storage Device తన ఇంటికి వచ్చింది?

ఆ పాస్‌పోర్ట్ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు?


కాసేపటికి తేరుకుని రాము ఆలోచిస్తూనే ఆఫీస్ టైమ్ అయిపోయింది అనుకొని ఆఫీస్ వెళ్లిపోయాడు.  అతని మనసులో వందల ప్రశ్నలు కానీ సమాధానం ఒక్కటి కూడా లేదు. ఆ రోజు మొత్తం ఆఫీస్‌లో ఉన్నా, అతని ఆలోచనలు మాత్రం ఇంట్లో ఉన్న ఆ Storage Device దగ్గరే ఉన్నాయి.

ఆ రాత్రి రాముకి మళ్లీ ఒక కల వచ్చింది. ఉదయం సుమారు ఆరు గంటలు. రాము ఇంకా నిద్రలోనే ఉన్నాడు. అప్పుడే టక్… టక్… టక్… ఇంటి తలుపు కొట్టిన శబ్దం వచ్చింది. రాము తలుపు దగ్గరకు వెళ్లాడు. బయట ఎవరూ లేరు. కారిడార్ మొత్తం ఖాళీగా ఉంది. అతని కాళ్ల దగ్గర మళ్లీ చిన్న పార్సెల్ కనిపించింది. ఎలాంటి పేరు, అడ్రస్ లేదు. ఎవరు పంపారో తెలియదు. .అందులో మళ్లీ ఒక Storage Device. దానిపై  PROJECT – D అదే పాస్‌పోర్ట్ ఫోటో. Device‌ని కంప్యూటర్‌కి కనెక్ట్ చేశాడు, ఫోల్డర్  DREAM_002 వీడియో ప్లే చేశాడు. అతని కళ్లలో భయం ఎందుకంటే కొన్ని గంటల క్రితం అతనికి వచ్చిన అదే కల.

ఆ రోజు నుంచి రాము జీవితంలో నిద్ర భయంగా మారింది. అప్పటి వరకు రాముకి కలలు అంటే ఆసక్తి. మంచి కలలు వస్తే ఆనందం, చెడు కలలు వస్తే దేవాలయం. కానీ ఇప్పుడు నిద్రపోవడమే భయంగా మారింది.

రాము ఒక విషయం గమనించాడు. తనకు ఆ Device‌లు రావడం ప్రారంభమైన తర్వాత తన జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. తను ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరో ముందే తెలుసుకున్నట్టు. తనకు ఇష్టమైన దేవాలయం దగ్గర ఒకే వ్యక్తి పదేపదే కనిపిస్తున్నట్టు. తన ఆఫీస్ ఎదురుగా ఒక కారు తరచుగా నిలబడుతున్నట్టు. రాత్రి ఇంటికి వస్తున్నప్పుడు ఎవరో తన వెనుక నడుస్తున్నట్టు.

“నిజంగానే ఎవరో నన్ను గమనిస్తున్నారు.”

ఎవరు?

ఎందుకు?

Project – D వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి?

ఆ పాస్‌పోర్ట్ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు?

రాము అసలు ఎవరు?

అతని తండ్రి ఎక్కడ ఉన్నాడు?

ఇలా ఎన్నో ప్రశ్నలు, ఈ ప్రశ్నలకు సమాధానం…

ఈ చిన్న కథలో లేదు. ఎందుకంటే…

PROJECT – D ఇంకా ప్రారంభం మాత్రమే.


Related Story

కొన్ని రహస్యాలు మనం దాచాలనుకున్నా… అవి ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయి. జ్ఞాపకాలు, భావోద్వేగాలు మరియు మనిషి మనసులో దాగి ఉండే విషయాలపై మరో ఆసక్తికరమైన కథను చదవండి:

👉 STORAGE 

ఈ కథను చదవడానికి STORAGE పై క్లిక్ చేయండి.


🎬 PROJECT – D | Full Script & Story Concept

PROJECT – D కథలో అసలు రహస్యం ఏమిటి?

రాము ఎదుర్కొంటున్న ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దాగి ఉంది?

కథ ముందుకు సాగుతున్న కొద్దీ బయటపడే ఆ నిజం… మీ ఊహకు అందుతుందా?

ఈ కథకు సంబంధించిన పూర్తి కథ, అసలు రహస్యం, పాత్రల వివరాలు మరియు పూర్తి Script తెలుసుకోవాలనుకుంటున్నారా?


🎥 Movie Lovers | Producers | Directors | Story & Concept Enthusiasts

కొత్త కథలు, వినూత్నమైన Suspense Concepts మరియు Movie Story Ideas పై ఆసక్తి ఉన్నవారు సంప్రదించవచ్చు.


📜 Full Script | Script Rights | Copyright & Story Details

PROJECT – D పూర్తి Script లేదా Script Rights / Copyright సంబంధిత వివరాల కోసం InkVerse Official Contact Page ద్వారా సంప్రదించండి.

ఎందుకంటే…

కొన్ని కథలు చదవడానికి మాత్రమే కాదు…తెరపై చూడటానికి పుడతాయి.


Disclaimer

This story is a work of fiction created for entertainment purposes. All characters, events, locations, technologies, and incidents depicted in this story are fictional. Any resemblance to real persons, places, organizations, or events is purely coincidental. The story does not intend to promote, endorse, or represent any real-world individual, organization, or technology.


- InkVerse Official 

Create. Write. Inspire 

Comments

Popular posts

The School Bus

The Dark Secret

STORAGE (జ్ఞాపకాల నిధి) | AI, Memory & Love – A Heart-Touching Telugu Science Fiction Story

Trio( Fears. Tears. Years.)

Top 10 Free AI Tools in 2026: Best AI Tools for Students, Bloggers, Creators & Professionals