ARRIVAL | Telugu Suspense Story | By AD
ARRIVAL | Telugu Suspense Story | By AD
Note:
You can read this story in the language you prefer. Use the Translator option on InkVerse Official to translate and enjoy the story in your preferred language.
రాము తిరిగి వచ్చిన రోజు… Airportలో అసలు ఏం జరిగింది?
కొంతమంది మనుషులను చూసి… “వీడితో ఏం ఉపయోగం?” అని అనుకుంటాం. కానీ అదే మనిషి ఒకరోజు మన ముందే నిలబడి… మనం ఊహించని సమాధానం ఇస్తే?, రాము అలాంటి వ్యక్తే. అతను చేసే ప్రతి పనికి వెంటనే ఫలితం రావాలని కోరుకునే వ్యక్తి కాదు, తాను చేస్తున్న పని ఒకరోజు అందరికీ తెలియాలని మాత్రం కోరుకునేవాడు. రాము ఎప్పుడూ ఒక ప్రశ్నార్థకంగానే ఉండేవాడు.
రాము చదువు పూర్తిచేసి అప్పటికే ఏడు సంవత్సరాలకు పైగానే అయింది, ఉద్యోగం లేదు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడా?, అని అడిగితే “...........” అంతే అంతకంటే ఎక్కువ సమాధానం వచ్చేది కాదు. ఇంట్లో వాళ్లకు మాత్రం అది నచ్చేది కాదు.
“నీతో చదివిన వాళ్లంతా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు.”
“నువ్వేం చేస్తున్నావు?”
“ఇలా ఎప్పటివరకు ఉంటావు?”
“కనీసం ఏదైనా చిన్న ఉద్యోగం అయినా చూసుకో!”
రోజూ ఇలాంటి మాటలు రాముకు వినిపించేవి. కొన్నిసార్లు ఆ మాటలు తిట్లుగా మారేవి. కానీ రాము మాత్రం ఎవరి మాటలకూ పెద్దగా స్పందించేవాడు కాదు. చివరకు “వీడు మారడు.” అని ఇంట్లో వాళ్లే అతన్ని పట్టించుకోవడం మానేశారు.
“మనుషుల్ని వారి పరిస్థితుల ఆధారంగా అంచనా వేయకూడదనే భావనను గుర్తు చేసే మరో కథ: The School Bus.”
ఒకరోజు రాము ఇంటి నుంచి సాధారణంగానే బయటికి వెళ్లాడు. ఎక్కడికి వెళ్తున్నావని అడిగినా పెద్దగా చెప్పలేదు. మొదటి రోజు “వస్తాడు లే.” అనుకున్నారు. రెండో రోజు కూడా రాలేదు. అయినా పెద్దగా పట్టించుకోలేదు. రెండో రోజు రాత్రి రాము ఫోన్‌కి కాల్ చేశారు. “The number you are trying to reach is not reachable.” మళ్లీ చేశారు అదే సమాధానం. మరోసారి…అదే. అప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ల ముఖాల్లో ఆందోళన మొదలైంది.
“ఎక్కడికి వెళ్లాడు?”
“ఏం జరిగింది?”
“ఎవరితోనైనా వెళ్లాడా?”
అసలు అతను తిరిగి వస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితి.
మూడో రోజు ఉదయం తలుపు తీసి చూస్తే…రాము. అతను సాధారణంగానే లోపలికి వచ్చాడు. అతన్ని చూసిన వెంటనే ఇంట్లో వాళ్లకు కోపం వచ్చి,
“ఎక్కడికి వెళ్లావు?”
“రెండు రోజుల నుంచి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్?”
“మేమంతా ఇక్కడ టెన్షన్ పడుతుంటే నీకు ఏమీ పట్టదా?”
ఒక్కొక్కరుగా అందరూ రామును తిట్టడం మొదలుపెట్టారు. రాము మాత్రం ఏమీ మాట్లాడలేదు. అతను తన చేతిలో ఉన్న ఒక కవర్‌ను నెమ్మదిగా బయటకు తీసి అందరి ముందు పెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా ఆ కవర్ వైపు చూసి, కవర్ తీసి తెరిచారు. లోపల ఉన్న పేపర్ చూసిన వెంటనే అందరి మాటలు ఆగిపోయాయి.
అది ఒక ప్రముఖ Multinational Company నుంచి వచ్చిన Job Offer Letter. Salary ₹50 Lakhs Per Annum. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు రామును తిడుతున్న వాళ్లే, ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. రాము మాత్రం చిన్నగా నవ్వి , ఒక్క క్షణం ఆగి, “ఇక నుంచి మీ బాధ్యత నాది.” అన్నాడు. ఆ మాటతో, ఏడు సంవత్సరాలుగా కుటుంబానికి అర్థం కాని రాము…ఆ రోజు మొదటిసారి వాళ్లకు అర్థమయ్యాడు.
కొన్ని రోజుల్లోనే రాము ఉద్యోగంలో చేరిపోయాడు. అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. కొత్త ఉద్యోగం, కొత్త బాధ్యతలు, కొత్త ప్రపంచం. ఇంట్లో పరిస్థితులు కూడా క్రమంగా మారాయి. ఇంతకాలం అద్దె ఇంట్లో ఉన్న కుటుంబం కొంతకాలానికి ఒక మంచి gated communityలోకి మారింది. ఇంట్లో సౌకర్యాలు పెరిగాయి. కుటుంబానికి అవసరమైన ప్రతి విషయం రాము చూసుకోవడం మొదలుపెట్టాడు. అతన్ని తక్కువగా చూసిన వాళ్లే ఇప్పుడు…“మన రాము…” అని గర్వంగా చెప్పుకునే స్థితికి వచ్చారు.
కొంతకాలానికి రాము పనిచేస్తున్న projectలో ఒక పెద్ద అవకాశం వచ్చింది. ఆ project success కావడంతో, రాముకు promotion వచ్చింది. దానితో పాటు, United States transfer. రాము ఆ విషయం తన కుటుంబానికి చెప్పాడు. ఈసారి ఇంట్లో వాళ్లు అతన్ని ఆపలేదు. ఎందుకంటే… వాళ్లకు ఇప్పుడు రాముపై పూర్తి నమ్మకం ఉంది. “జాగ్రత్తగా వెళ్ళిరా” అని ఆశీర్వదించారు. రాము Statesకి వెళ్లిపోయాడు.
రాము States వెళ్లిన తర్వాత అతని career మరింత వేగంగా ఎదగడం మొదలైంది. కొత్త projects, కొత్త responsibilities, కొత్త connections, కొత్త opportunities. అతని income కూడా పెరుగుతూ వచ్చింది. కుటుంబం ఇండియాలో రాము పంపిస్తున్న డబ్బుతో మరింత comfortable life lead చేయడం మొదలుపెట్టింది. కొంతకాలానికి వాళ్ల జీవితం పూర్తిగా మారిపోయింది. అద్దె ఇల్లు…గేటెడ్ కమ్యూనిటీ…ఆ తర్వాత మరింత luxury lifestyle. ఒక సంవత్సరం గడిచిపోయింది. కుటుంబం దృష్టిలో రాము ఇప్పుడు వాళ్ల కుటుంబాన్ని పూర్తిగా మార్చేసిన విజయవంతమైన వ్యక్తి.
ఒక సంవత్సరం తర్వాత ఒకరోజు రాము కుటుంబం అతనికి పెళ్లి చేయాలని నిర్ణయించింది. మ్యాచ్ చూడటానికి రామును ఇండియాకు పిలిచారు. రాము కూడా ఒప్పుకున్నాడు. Flight ticket బుక్ అయింది, తేదీ వచ్చింది, రాము ఇండియాకు బయలుదేరాడు. ఈసారి మాత్రం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందం కనిపించింది.
Airportకి అందరూ వెళ్లారు. “మన రాము వస్తున్నాడు!” అని ఎదురు చూస్తున్నారు. కానీ, ఆ రోజు Airportలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. చుట్టూ భారీ crowd, పోలీసులు, Media cameras, Security. VIP-level arrangements లాగా కనిపిస్తున్నాయి. రాము కుటుంబం ఒకరినొకరు చూసుకున్నారు. “ఏదైనా VVIP వస్తున్నాడేమో…” లేదా “మన రాము ఒక సంవత్సరంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్లాడో అందరికీ తెలిసిపోయిందేమో!” అని అందరూ నవ్వుకున్నారు.
Flight landed…కొంతసేపటికి…Arrival gate దగ్గర కదలిక మొదలైంది. Passengers ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కుటుంబ సభ్యుల కళ్లన్నీ ఒక్కసారిగా రాము పై ఆగిపోయాయి. అతను బయటకు వస్తున్నాడు. అతని చేతిలో luggage, ముఖంలో అదే ప్రశాంతత. అతన్ని చూసిన వెంటనే కుటుంబ సభ్యులు “రాము” అని పిలవబోతున్న సమయంలో…అక్కడ ఉన్న పోలీసులు ఒక్కసారిగా అతని వైపు కదిలారు, రామును చుట్టుముట్టారు. కుటుంబ సభ్యులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రాము “ఏమైంది?” అని అడిగాడు. ఎవరూ సమాధానం చెప్పలేదు. ఒక పోలీస్ అధికారి అతని దగ్గరకు వచ్చాడు. రాము మళ్లీ అడిగాడు… “నన్నెందుకు తీసుకెళ్తున్నారు?” అతని మాటలు పూర్తయ్యేలోపే…పోలీసులు అతన్ని తమతో తీసుకెళ్లడం ప్రారంభించారు. Media cameras అన్నీ రామువైపు తిరిగాయి. Flashలు వరుసగా పడుతున్నాయి. కుటుంబ సభ్యులు అక్కడే నిలబడి “రాము” అని అరుస్తున్నారు. కానీ…రాము వెనక్కి తిరిగి చూసేలోపే, అతన్ని పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
“ఇలాంటి suspense stories కోసం The Dark Secret కూడా చదవండి.”
కొన్ని seconds క్రితం…తన కుటుంబం కోసం తిరిగి వచ్చిన విజయవంతమైన వ్యక్తి. ఇప్పుడు…పోలీసుల మధ్యలో నడుస్తున్న ఒక వ్యక్తి. అసలు Airportలో పోలీసులు రామును ఎందుకు అరెస్ట్ చేశారు?.
తెలుసుకోవాలంటే…
Connect with InkVerse Official
ఎందుకంటే…
తర్వాత జరిగేది…
మీరు ఊహించిన దానికంటే పూర్తిగా భిన్నంగా ఉండొచ్చు.
To be continued…
Disclaimer
“ARRIVAL” is an original fictional story created for entertainment and creative storytelling purposes by AD and published on InkVerse Official. The characters, events, situations, and locations depicted in this story are fictional. Any resemblance to real persons, places, or events is purely coincidental.
This story does not intend to hurt, defame, or target any individual, community, organization, or institution. Any interpretation of the story is the reader’s own.
Copyright Notice
© 2026 AD / InkVerse Official. All Rights Reserved.
“ARRIVAL” and its original storyline, characters, concepts, written content, and creative elements are protected by applicable copyright laws. No part of this story may be copied, reproduced, republished, modified, distributed, translated, or used commercially in any form without prior written permission from the copyright owner.
For permissions, adaptations, collaborations, or movie/web-series/short-film opportunities, please contact the author through InkVerse Official.
-InkVerse Official
Create. Write. Inspire

Comments
Post a Comment