Sulochana Devi – Part 2

 

రాణి సులోచనా దేవి పార్ట్ 2 కథలో సమాధి వద్ద కాటికాపరి, ధనవంతుడు మరియు పిచ్చివాడు





📖 Part 1 మిస్ అయ్యారా?

Part 1 చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


చితి మంటలు మెల్లగా తగ్గుతున్నాయి.

ఆ ముగ్గురూ నిశ్శబ్దంగా నడవడం ప్రారంభించారు.

శ్మశానంలో ప్రతి అడుగూ ఒక ప్రశ్నలా వినిపిస్తోంది.

అప్పుడే కాటి కాపరి ఒక చితి బూడిద దగ్గర ఆగాడు.

కొద్దిగా బూడిదను చేతిలోకి తీసుకుని మెల్లగా గాలిలో వదిలాడు.

ఈ బూడిదను చూస్తున్నారా?

కొద్దిసేపటి క్రితం ఇది ఒక మనిషి.

అతనికి పేరు ఉంది, పదవి ఉంది, సంబంధాలు ఉన్నాయి.

ఇప్పుడు...?, ఇది ఎవరిది...?

ధనవంతుడు నిశ్శబ్దంగా తల వంచాడు.

కాటి కాపరి వాళ్లిద్దరి వైపు చూస్తూ ఇలా అన్నాడు. 

" నేను రాజుల్ని కాల్చాను...కూలీలను కాల్చాను...బంగారు ఉంగరాలు వేసుకున్న చేతులు కూడా చివరికి బూడిదే అయ్యాయి. ఖాళీ చేతులతో వచ్చిన వాళ్లు కూడా బూడిదే అయ్యారు ".

అప్పుడు నాకు తెలిసింది...మరణం ఎప్పుడూ సమానత్వం నేర్పుతుంది అని. 

ధనవంతుడు లోతుగా ఊపిరి తీసుకుని, "నేను సంపాదించింది డబ్బు కాదు...నా పిల్లల భవిష్యత్తు అనుకున్నాను.

కానీ...వాళ్లు నా ప్రేమను చూడలేదు, నా ఆస్తిని మాత్రమే చూశారు." అతని గొంతు వణికింది.

"నేను దానం చేసిన వేలమందిలో ఎవరో ఒకరు నన్ను గుర్తు పెట్టుకుని ఏడుస్తారేమో కానీ 

నా ఇంట్లో...నా కోసం ఒక్క కన్నీరు కూడా ఉండకపోవచ్చు."

అంతలో ఆ మూడో అయినా ఆ పిచ్చివాడు నవ్వుతూ, అతని నవ్వులో బాధ ఉంది.

"కన్నీళ్లు కూడా కర్మ మీదే ఆధారపడతాయి " అన్నాడు.

ఇద్దరూ అతని వైపు చూశారు.

"కర్మ అంటే శిక్ష కాదు.

కర్మ అంటే ప్రతిధ్వని.

నువ్వు ప్రపంచానికి ఏ శబ్దం పంపావో...అదే ఎప్పుడో ఒకరోజు నీ దగ్గరకు తిరిగి వస్తుంది."

ధనవంతుడు అడిగాడు. "అయితే మంచి వాళ్లకే ఎందుకు కష్టాలు వస్తాయి?"

అతను నవ్వి,  "విత్తనం నాటిన రోజు పండు రాదు. అలాగే...కర్మ ఫలితం కూడా వెంటనే రాదు. మనకు కనిపించేది ఒక్క జన్మ. ప్రకృతికి కనిపించేది మొత్తం ప్రయాణం."

ముగ్గురూ ముందుకు నడుస్తూ... కాటికాపరి ఇలా అంటాడు.

"మనిషి జీవితంలో డబ్బు శాశ్వతం కాదు... సంపాదించిన కీర్తే శాశ్వతం. కాటికాపరిగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన నాకు ఓ తోడును ఇచ్చి పెళ్లి చేసి, నా పిల్లల జీవితాలకు ఓ దారి చూపించి......."

ఇంతలో ఆ ధనవంతుడు ఆశ్చర్యంగా చూస్తూ, "నీకు పెళ్లి అయిందా?" అని అడిగాడు.

అతడు నవ్వి,  అయింది... నాకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఇప్పుడు వాళ్లు నగరంలో ఉద్యోగాలు చేసుకుంటూ తమ కాళ్ల మీద తాము నిలబడి జీవిస్తున్నారు. 

కానీ... ఇవన్నీ చూసి ఆనందించాల్సిన నా భార్య మాత్రం చాలా తొందరగానే ఈ లోకాన్ని విడిచి దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది.

అప్పుడు ఆ ధనవంతుడు ఆశ్చర్యంగా, మరి నువ్వు ఇంకా ఈ పని ఎందుకు చేస్తున్నావు? అని అడిగాడు.

అందుకు అతడు గర్వంగా చిరునవ్వు నవ్వి,  ఇది నా వృత్తి. ఎవరి మీదా ఆధారపడకుండా జీవించే దారిని ఆ దేవుడు నాకు చూపించాడు అన్నాడు.

కొద్ది సేపటికి, కాటికాపరి జీవితంలో మరియు ఎందరో జీవితాల్లో వెలుగు నింపిన ఆ పుణ్యమూర్తి సమాధి దగ్గరకు చేరుకున్నారు, దాని పై పచ్చిక మొలిచింది.

రాతిపై చెక్కిన అక్షరాలు స్పష్టంగా ఉన్నాయి.

"రాణి సులోచన దేవి"

గాలి ఒక్కసారిగా బలంగా వీచింది.

సమాధిపై ఉన్న ఎండిన ఆకులు ఎగిరిపోయాయి.

"రాణి సులోచన దేవి" అనే పేరు మరింత స్పష్టంగా కనిపించింది.

ఆ సమాధిని చూడగానే ఆ కాటికాపరి భక్తి, కృతజ్ఞతలతో సమాధికి దండం పెట్టుకున్నాడు.

ఆ సమాధిని చూసిన ధనవంతుడు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు.

అంతలో ఆ పిచ్చివాడు దుఃఖాన్ని ఆపుకోలేక సమాధి కాళ్ల దగ్గరే కూర్చుండిపోయాడు.

వారిద్దరినీ చూస్తున్న కాటికాపరికి ఏమీ అర్థం కాలేదు. అయోమయంలో వారినే చూస్తూ నిలబడ్డాడు.

ఇంతకీ రాణి సులోచనాదేవికి, ఆ ధనవంతుడికి, ఆ పిచ్చివాడికి ఉన్న సంబంధం ఏమిటి?

తెలుసుకోవాలంటే... పూర్తి కథ కోసం సంప్రదించండి.

కథలు, కథా ఆలోచనలు కావాలా?

మీరు Movie Lover, Producer, Actor లేదా Director అయి, కొత్త కథలు, కథా ఆలోచనలు లేదా సినిమా కాన్సెప్ట్స్ కోసం చూస్తున్నట్లయితే, InkVerse Official ను సంప్రదించండి. మీకు నచ్చిన కథను సినిమా లేదా ఇతర క్రియేటివ్ ప్రాజెక్ట్‌గా మలచాలనే ఆసక్తి ఉంటే, మాతో సంప్రదించవచ్చు. మీ తదుపరి సినిమా కథ… ఇక్కడి నుంచే మొదలవచ్చు. 

Disclaimer 

ఈ కథ పూర్తిగా రచయిత సృజనాత్మక కల్పితం. ఇందులోని కథ, పాత్రలు, సంభాషణలు మరియు కథాంశాన్ని రచయిత అనుమతి లేకుండా పూర్తిగా లేదా పాక్షికంగా కాపీ చేయడం, పునఃప్రచురించడం లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం అనుమతించబడదు.

ఈ కథను మీకు నచ్చిన భాషలో చదవడానికి, బ్లాగ్‌లో ఉన్న Translator సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు. Read this story in your preferred language using the Translator available on our blog.


-InkVerse Official 

Create. Write. Inspire 

Comments

Popular posts

The School Bus

STORAGE (జ్ఞాపకాల నిధి) | AI, Memory & Love – A Heart-Touching Telugu Science Fiction Story

Trio( Fears. Tears. Years.)

The Dark Secret

Top 10 Free AI Tools in 2026: Best AI Tools for Students, Bloggers, Creators & Professionals